CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ చేతులు మీదుగా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ లకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారన్నారు. విశాఖ ప్రజల చిరకాల కోరిక, విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఎక్కడికెళ్లినా ప్రధాని మోదీపై ప్రజలు నమ్మకం చూపిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీపై నమ్మకం, విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలే అయ్యిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చారని తెలిపారు.
Home Andhra Pradesh రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి తీరుతాం- సీఎం చంద్రబాబు-cm...