గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)దిల్ రాజు(Dil Raju)కలయికలో తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(Game Changer)సంక్రాంతి కానుకగా ఈనెల 10 న విడుదల కాబోతుండగా రామ్ చరణ్ కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది.నిర్మాత దిల్ రాజు కూడా తన బ్యానర్ లో గేమ్ చేంజర్ 50 వ చిత్రం కావడంతో ఎంటైర్ తన కెరిరీలోనే ఫస్ట్ టైం మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో నిర్మించాడు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు సాంగ్స్ రిలీజైన విషయం తెలిసిందే. ఆ నాలుగు పాటలు కూడా ఒక దాన్ని మించి ఒకటి ప్రేక్షకాదరణ పొందటమే కాకుండా రికార్డు వ్యూస్ ని కూడా సంపాదించాయి.తాజాగా ‘కొండ దేవర’ అనే ఆడియో సాంగ్ రిలీజ్ అయ్యింది.సాంగ్ వింటుంటే జాతరకి సంబంధించిన సాంగ్ అని ప్రతి ఒక్కరు భావించేలా ఉండంతో పాటు కథకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చెప్తున్నట్టుగా కూడా సాంగ్ ఉంది. లిరిక్స్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉన్నాయి.థమన్ మ్యూజిక్ కూడా చాలా ఫాస్ట్ గా సాగుతు అంతే పవర్ ఫుల్ గా ఉంది.కాసర్ల శ్యామ్ స్వర రచన చెయ్యగా థమన్,శ్రావణ భార్గవి ఆలపించడం జరిగింది.
ఇక ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తుండగా కియారా అద్వానీ(Kiara Adwani)అంజలి(Anjali)హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఎస్ జె సూర్య,సముద్రఖని,శ్రీకాంత్,సునీల్ కీలక పాత్రలు పోషించగా ఒక ఐఏఎస్ ఆఫీసర్,ఒక రాజకీయనాయకుడుకి మధ్య జరిగిన ఘర్షణే ఈ చిత్రం.