యాంకరింగ్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎంతో విషయ పరిజ్ఞానం ఉండాలి. అదే సమయంలో ఎవరినీ నొప్పించకుండా, సందర్భానికి తగ్గట్టుగా మాటలను అల్లుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ మధ్య అలాంటి యాంకర్లు అత్యంత అరుదైపోయారు. విషయ పరిజ్ఞానం ఉండట్లేదు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రుల పేర్లు మర్చిపోతున్నారు. ఇంకా కొందరైతే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వివాదమవుతుందనే కనీస అవగాహన లేకుండా.. నోటికొచ్చింది మాట్లాడేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా యాంకర్ శ్రీముఖి కూడా ఆ లిస్టులో చేరింది.  (Sreemukhi)

 

ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లను పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రయత్నించి.. పురాణ పురుషులైన రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ హిందువులకు ఆగ్రహం తెప్పించింది. “రామ్ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్. కానీ సాక్షాత్తూ నా కళ్ళ ముందు కూర్చున్నారు.. ఒకరు దిల్ రాజు అయితే, ఇంకొకరు శిరీష్ గారు” అంటూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం భగ్గుమంటోంది. శ్రీముఖి వెంటనే తన కామెంట్స్ ని వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

 

శ్రీముఖి కొత్త యాంకరేమీ కాదు. యాంకరింగ్ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి శ్రీముఖి.. కనీస ఆలోచన లేకుండా ఇలా హిందు దేవుళ్ళ గురించి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈమధ్య యాంకర్ల తీరే ఇలా ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయినా వాళ్ళు.. కాస్ట్యూమ్స్, మేకప్ మీద పెడుతున్న శ్రద్ధ కంటెంట్ మీద పెట్టడం లేదు. సరైన ప్రిపరేషన్ లేకుండానే స్టేజ్ ఎక్కేస్తున్నారు. ఆ టైంకి నోటికి వచ్చిందేదో మాట్లాడి ఇలా వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే మరక మంచిదే అన్నట్టుగా.. ఈ వివాదాలు వల్ల కూడా బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని సంబరపడుతున్నారు. మరి శ్రీముఖి కూడా అలాగే సంబరపడి ఈ వివాదాన్ని ముదిరేలా చేస్తుందో? లేక ముందే క్షమాపణలు చెప్పి తన తప్పుని సరి చేసుకుంటుందో? చూడాలి.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here