సామ్ ఆల్ట్ మన్ స్పందన

తన సోదరి తనపై చేసిన ఆరోపణలపై ఓపెన్ఏఐ (openAI) సీఈఓ 39 ఏళ్ల సామ్ ఆల్ట్ మన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ ఎక్స్ లో తను, తన తల్లి, సోదరుల తరఫున ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. ‘ఈ పరిస్థితి మా కుటుంబం మొత్తాన్ని ఎంతో బాధపెడుతోంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తన సోదరి ఆనీ మానసిక సమస్యతో బాధపడుతోందని వెల్లడించారు. ‘‘ఆనీ మా నుండి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉంది” అని సామ్ ఆల్ట్ మన్ చెప్పాడు. ఆమెకు అన్నిరకాలుగా సహాయపడటానికి మేము చాలా విధాలుగా ప్రయత్నించామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here