ఇస్రో కొత్త చైర్మన్ వి.నారాయణన్ ఎవరు?
- వీ నారాయణన్ తమిళనాడు (tamil nadu) లోని కన్యాకుమారి జిల్లాకు చెందినవారు.
- వి.నారాయణన్ రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న విశిష్ట శాస్త్రవేత్త.
- రాకెట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ నిపుణుడైన ఆయన 1984లో ఇస్రోలో చేరి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్ కావడానికి ముందు వివిధ హోదాల్లో పనిచేశారు.
- తొలిదశలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో సౌండింగ్ రాకెట్స్ అండ్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV), పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) సాలిడ్ ప్రొపల్షన్ ఏరియాలో పనిచేశారు.
- రియలైజేషన్ ఆఫ్ అబ్లేటివ్ నాజిల్ సిస్టమ్స్ ప్రాసెస్ ప్లానింగ్, ప్రాసెస్ కంట్రోల్, కాంపోజిట్ మోటార్ కేసెస్, కాంపోజిట్ ఇగ్నైటర్ కేసెస్ లలో సేవలను అందించారు.
- ప్రస్తుతం తిరువనంతపురంలోని వలియమలలో ఇస్రో (ISRO) ప్రధాన కార్యాలయం, బెంగళూరులో యూనిట్ ఉన్న ఎల్పీఎస్సీకి నారాయణన్ డైరెక్టర్ గా ఉన్నారు.
వి.నారాయణన్ విద్యార్హతలు, అవార్డులు
- ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తి చేశారు.
- 2001లో ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఏరో స్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ చేశారు.
- ఎంటెక్ లో మొదటి ర్యాంకుకు ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి రజత పతకం, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) నుంచి గోల్డ్ మెడల్, రాకెట్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ కు ఏఎస్ ఐ అవార్డు, హై ఎనర్జీ మెటీరియల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి టీమ్ అవార్డు, ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డులు, ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు.
- చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డిగ్రీ పొందారు.
- ఐఐటీ ఖరగ్పూర్ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు-2018, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) నేషనల్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఫోరం నుంచి నేషనల్ డిజైన్ అవార్డు-2019, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (AESI) నుంచి నేషనల్ ఏరోనాటికల్ ప్రైజ్-2019 అందుకున్నారు.
- నారాయణన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ (IAA) సభ్యుడు, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (INAE) ఫెలో, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ యొక్క స్పేస్ ప్రొపల్షన్ కమిటీ సభ్యుడు, ఇండియన్ సొసైటీ ఆఫ్ సిస్టమ్స్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ISSE) జాతీయ అధ్యక్షుడు.
- ఇండియన్ క్రయోజనిక్ కౌన్సిల్ ఫెలోగా, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుడిగా, ఐఎన్ ఏఈ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా, వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాడీల్లో సభ్యుడిగా సేవలందించారు.
- గవర్నింగ్ కౌన్సిల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) బోర్డ్ మెంబర్ గా, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా కూడా సేవలందిస్తున్నారు.
అంతరిక్ష రంగంలో భారత్ ముందంజ
చంద్రయాన్ 4, గగన్ యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లకు కీలకమైన స్వదేశీ పరిజ్ఞానం స్పాడెక్స్ ను ప్రయోగించి ఇస్రో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాల జాబితాలో భారత్ ను చేర్చింది. మిగతా దేశాలు అమెరికా, రష్యా, చైనా.