PM Modi Visakha Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ భారీ రోడ్‌ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here