కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్(Puneeth raj kumar)హీరోగా 2003 లో తెరకెక్కిన ‘అభి’ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్  రమ్య(Ramya).అదే సంవత్సరం నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)హీరోగా వచ్చిన అభిమన్యు అనే చిత్రం ద్వారా తెలుగులో కూడా అరంగ్రేటం చేసింది.ఆ తర్వాత  తెలుగు చిత్రాల్లో కనిపించకపోయినా కూడా  కన్నడ, తమిళ భాషల్లో కలిపి సుమారు నలభై సినిమాల దాకా చేసింది.చివరగా 2023 లో ‘హాస్టల్ హుడుగురు బేకా గిద్దారే’ అనే సినిమాలో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చి తన అభిమానులని అలరించింది.

ఇప్పడు ఈ సినిమాపై రమ్య బెంగుళూరులోని కమర్షియల్ కోర్టులో కేసు వేసింది.నా అనుమతి లేకుండా  హాస్టల్ హుడుగురు బేకా గిద్దారే(Hostel Hudugaru Bekagiddare) సినిమాలో నా వీడియోల్ని ఉంచారు.వాటిని వెంటనే తొలగించడంతో పాటు కోటి రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించాలి.గతంలో ఒకసారి ఆ మూవీ నిర్మాతలతో నా వీడియోల్ని తొలగించాలని అడిగినా కూడా పట్టించుకోలేదు.ఇప్పుడైనా నా వీడియోల్ని తొలగిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

ఇక ‘హాస్టల్ హుడుగురు బేకా గిద్దారే’ లో ప్రజ్వల్,మంజునాథ నాయకా,రాకేష్ రాజ్ కుమార్, శ్రీ వత్స ముఖ్యపాత్రలు పోషించగా నిఖిల్ స్వామినాథన్ దర్శకత్వాన్ని వహించాడు.ఈ మూవీ రిలీజ్ టైంలో కూడా రమ్య సినిమా ఆపివేయాలని కేసు వేసింది.కానీ కోర్టు కేసుని కొట్టివేసింది.కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా కూడా రమ్య పని చేసింది.ప్రస్తుతం మాజీ ఎంపీ హోదాలో కొనసాగుతుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here