మూవీ: నీలిమేఘశ్యామ

నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ, తనికెళ్ళ భరణి తదితరులు

ఎడిటింగ్: బాలాజీ విబీజే

సినిమాటోగ్రఫీ: సునీల్ రెడ్డి

మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్

నిర్మాతలు: కార్తీక్ సత్య

దర్శకత్వం: రవి ఎస్ వర్మ

ఓటీటీ: ఆహా

కథ:

హైదరాబాద్ లో శ్యామ్ అనే అతను ఓ యాడ్ ఏజన్సీ రన్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అయితే శ్యామ్ రాత్రి రెండింటి దాకా తాగడం, పొద్దున్నే పదకొండు అయినా లేవడు.  దాంతో వాళ్ళ నాన్న ఎందుకు పనికిరావు.. కాస్త జ్ఞానం పెంచుకోమంటూ, పైకి ఎదుగూ అంటూ తిడుతుంటాడు. ఇక దానిని సీరియస్ గా తీసుకున్న శ్యామ్ బుద్దునికి జ్ఞానోదయం అయిన హిమాలయాలకి వెళ్తాడు. మనాలికి ట్రెక్కింగ్ వెళ్లిన శ్యామ్ కి కో ట్రెక్కర్ గా మేఘ పరిచయమవుతుంది. ఇక వారిద్దరి పరిచయంలో ఎన్నో మలుపులు తిరుగుతాయి. అయితే ఒకానొక సందర్భంలో శ్యామ్ ని మేఘ ప్రేమిస్తుంది. కానీ ఓ పొరపాటు వల్ల శ్యామ్ ని తిట్టి వచ్చేస్తుంది మేఘ. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? మేఘ, శ్యామ్ ల ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

కథ హైదరాబాద్ లో మొదలైన ఎక్కువ భాగం మనాలిలో జరుగుతుంది. శ్యామ్, మేఘల ప్రేమకథ ఆడియన్స్ కి నచ్చుతుందా అంటే కొంతవరకు ఓకే కొంతవరకు బోరింగ్ అని చెప్పాలి.  కథలో కాస్త కామెడీ ఉంది కానీ అంతగా కనెక్ట్ కాలేదు. మనాలిలోలైనా ఎక్కడైనా ప్రేమకథ కాస్త ఎంగేజింగ్ అండ్ కాస్త థ్రిల్ ఉంటే జనాలు కనెక్ట్ అవుతారు. అయితే ఈ సినిమాలో అలాంటి ఎంగేజింగ్ సీన్లు లేకపోవడం పెద్ద మైనస్‌.

కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు‌. సినిమాకి ఒకే ఒక్క ప్లస్ ఏంటంటే నిడివి.. గంటా యాభై నిమిషాలు మాత్రమే. మంచుకొండల్లోని పరిసరాలని సినిమాటోగ్రాఫర్ చక్కగా బంధించిన దానికి సరైన స్టోరీ ఉంటే బాగుండేది. అడల్ట్ సీన్లు లేవు. ఆశ్లీల పదాలు వాడలేదు. చిన్న కథే కానీ స్లోగా సాగుతుంది. అది చాలా వరకు కథని డిస్టబ్ చేసింది.

హీరోకి ఓ ఫ్యామిలీ, హీరోయిన్ కి ఓ ఫ్యామిలీ కానీ వారిని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ లో ఇంకొన్ని డైలాగ్స్ రాస్తే బాగుండేది. ప్రేమకథలో డెప్త్ లేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు. పార్ట్ లు పార్ట్ లుగా వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సీన్లలో బిజిఎమ్ ఉంటే బాగుండేది. ముఖ్యంగా మంచుకొండల్లో హీరో , హీరోయిన్ మధ్య రాత్రి చలిమంట కాచుకునే సీన్లో కాస్త ఎలివేట్ చేయొచ్చు. భిన్నమైన కథలని ఇష్టపడేవారికి, స్లోగా సాగే కథలని ఇష్టపడేవారికి ఈ నీలిమేఘశ్యామ నచ్చొచ్చు. హై డోస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూసేవారికి ఇది నచ్చదు. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఒకే. బాలాజీ విబీజే ఎడిటింగ్ పర్వాలేదు. సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

శ్యామ్  పాత్రలో విశ్వదేవ్ రాచకొండ ఒదిగిపోయాడు. మేఘ పాత్రలో పాయల్ రాధాకృష్ణ ఆకట్టుకుంది. శ్యామ్ కి నాన్న పాత్రలో తనికెళ్ళ భరణి నటన బాగుంది‌. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : జస్ట్ వన్ టైమ్ వాచెబుల్. 

రేటింగ్: 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here