కెజీఎఫ్(Kgf)సిరీస్ తో ‘యష్'(Yash)ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందిన విషయం అందరకి తెలిసిందే.ఆ రెండు భాగాలతో ఎంతో మంది టాప్ స్టార్స్ ముందు అనేక కొత్త రికార్డులని సృష్టించే బాధ్యతని కూడా ఉంచాడు.ఇక కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ వెంటనే సినిమా చేయకుండా ఆ రెండు బాగాలకి తగ్గ కథ కోసం అన్వేషించి చివరకి టాక్సిక్'(Toxic)అనే ఒక విభిన్నమైన మూవీ చేస్తున్నాడు.మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన గీతూ మోహన్ దాస్(Geethu Mohandas)దర్శకత్వంలో కొన్ని నెలల క్రితం ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది.
ఇక నిన్న యష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టాక్సిక్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది.10 గంటల 20 నిమిషాలకి గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యగా,కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై ఆరు మిలియన్ల పైగా వ్యూస్ ని సంపాదిచించి,ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విధంగా ఫస్ట్ గ్లింప్స్ తో భారీ వ్యూస్ ని సంపాదించిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పాలి.పుష్ప 2 హిందీ వెర్షన్ 27 .67 మిలియన్ల వ్యూస్,తెలుగు వెర్షన్ 20 .45 మిలియన్లు,దేవర గ్లింప్స్ తెలుగు వెర్షన్ 26 .17 మిలియన్లు,హిందీ వెర్షన్ 18 .57 ,మహేష్ గుంటూరు కారం 20 .98 మిలియన్లు,కంగువా 20 .77 మిలియన్ల వ్యూస్ ని సంపాదించాయి.
ఇక టాక్సిక్ ని కెవీఎన్ ప్రొడక్షన్స్,మాన్ స్టార్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై సత్యనారాయణ, యష్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.హీరోయిన్ తో పాటు మిగతా నటి నటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.