నాచురల్ స్టార్ నాని(Nani)హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri)దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన కన్నడ భామ శ్రద్ద శ్రీనాధ్(shraddha Srinath)ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల,జోడి,సైంధవ్ వంటి చిత్రాలతో పాటు, రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘మెకానిక్ రాకీ’ లో కూడా నటించింది.ఇప్పుడు బాలకృష్ణ(Balakrishna)అప్ కమింగ్ మూవీ ‘డాకు మహారాజ్'(Daku Maharaj)లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది.
ఇక ఈ నెల 12 న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా శ్రద్ద శ్రీనాద్ మీడియాతో మాట్లాడుతు బాలయ్య గారి పక్కన నటించడం గొప్ప అనుభవం.సీనియర్ హీరోని అనే గర్వం ఆయనకి ఏ మాత్రం ఉండదు.సెట్ లో అందర్నీ నవ్విస్తూ చాలా సరదాగా ఉంటారు.కానీ డైరెక్టర్ షాట్ ఒకే చెప్పగానే పూర్తి ఏకాగ్రతతో క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేస్తారు.’సర్’ అని పిలిస్తే ‘బాల’అని పిలవమని అంటారు.ఆ పేరుతో పిలిస్తేనే ఆయనకి ఇష్టం.ఇంత వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు.బాలకృష్ణ గారి ‘డాకు మహారాజ్’ మరో ఎత్తు.
ఎందుకంటే బాలయ్య గారి సినిమా అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది.కాబట్టి నేను అందరికి మరింతగా తెలిసే అవకాశం ఉంది.దర్శకుడు బాబీ(Bobby)కూడా చాలా బాగా సినిమాని తెరకెక్కించాడు.కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది.నూటికి నూరుశాతం మా డాకు మహారాజ్ ఘన విజయాన్ని అందుకుంటుంది.ఇక ఈ సినిమాని తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థలో దర్శకుడు త్రివిక్రమ్(Trivikram)ఒక భాగమని తెలుసు.జెర్సీ మూవీ టైంలో ఆయన్ని కలిసాను తప్ప మళ్ళీ కలవలేదు.ఈ సారి కలిస్తే ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాను.ఆయన సినిమాల్లో నటించాలని చాలా బలమైన కోరికని చెప్పుకొచ్చింది.