సంక్రాంతి పండుగకి సినిమా పండుగ అని కూడా పేరు.అసలు పండుగ రోజున కొత్త సినిమా చూడలేదంటే పండుగ పూర్తి కానట్టే అనే నానుడి కూడా తెలుగు ప్రజల్లో చాలా బలంగా ఉంది.అందుకే బడా హీరోలు,బడా నిర్మాతలు తమ కొత్త సినిమాని సంక్రాంతి పండుగకి తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతుంటారు.అందుకు తగ్గట్టే ఈ సంక్రాంతికి రామ్ చరణ్(Ram Charan)నటించిన గేమ్ చేంజర్(Game Changer)బాలకృష్ణ(Balakrishna)డాకు మహారాజ్(Daku Maharaj)వెంకటేష్(Venkatesth)సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) లాంటి భారీ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.ఈ మూడు సినిమాల సెన్సార్ రిపోర్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
గేమ్ చేంజర్ మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఒక రేంజ్ లో ఉంది.మూవీ మొత్తానికి కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ నే బలం. ఇంటర్వెల్ బ్యాంగ్ ని చూసీ మెగా ఫ్యాన్స్,ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ముఖ్యంగా సెకండాఫ్ అదిరిపోయింది.యాక్షన్ సీన్స్ అయితే వింటేజ్ శంకర్(Shankar)స్థాయిలో ఉన్నాయి.సాంగ్స్ ద్వారా ప్రేక్షకులకి విజువల్ ట్రీట్ ఉండబోతుంది.శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతుంది.’డాకు మహారాజ్’ లో దర్శకుడు బాబీ(bobby)’డాకూ ఎపిసోడ్ డిజైన్ చేసిన తీరుకి నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారు.పాప పాత్రకు సంబంధించిన ట్విస్టే సినిమాకి కీలకంగా మారబోతుంది.ఆ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారన్నదాన్ని బట్టి డాకూ హిట్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.’దబిడి దిబిడి’ సాంగ్ థియేటర్లో మోతమోగిపోనుంది.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని వెంకీ మార్క్ కామెడీతో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi)ని డిజైన్ చేసాడు.మూవీలో వచ్చే కామెడి సీన్స్ ని నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ తో చూస్తే అభిమానులకి,ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఖాయం.ఫస్టాఫ్ హిలేరియస్‌గా ఉంటూ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది.క్లైమాక్స్ కూడా వెంకీ స్టైల్ ఆఫ్ మానరిజంతో పాస్ అయిపోయింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో ఉంది.అదే ఈ సినిమాకి అందాన్ని ఇచ్చింది.ఈ విధంగా మూడు సినిమాలు కూడా సంక్రాంతి ప్రేక్షకులని అలరించనున్నాయనే సెన్సార్ రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.గేమ్ చేంజర్ 10 న,డాకు మహారాజ్ 12 ,సంక్రాంతికి వస్తున్నాం 14 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.