తిరుమల తిరుపతి దేవాస్థానంలో పెనువిషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 48 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.