సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 10,11, 12, 19, 20 తేదీలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఆయా తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా.. సర్వీసులను నడపనుంది. ప్రత్యేక బస్సుల‌్లో టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది.