సినిమా పేరు: గేమ్ చేంజర్
తారాగణం: రామ్ చరణ్,కియారా అద్వానీ, అంజలి,ఎస్ జె సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: థమన్
ఎడిటర్: షమీర్ మహమ్మద్
సినిమాటోగ్రఫీ: తిరు
మాటలు : సాయిమాధవ్ బుర్రా
ఆర్ట్: అవినాష్ కొల్ల
కథ: కార్తీక్ సుబ్బరాజ్
స్క్రీన్ప్లే, దర్శకత్వం: శంకర్
నిర్మాత: దిల్రాజు, శిరీష్
బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: జనవరి 10, 2025
ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని పొందిన రామ్ చరణ్ ఈ రోజు ‘గేమ్ చేంజర్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పైగా ‘శంకర్’ దర్శకుడు కావడం,శంకర్ గత చిత్రం భారతీయుడు 2 పరాజయం చెందటంతో గేమ్ చేంజర్’ రిజల్ట్ విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పైగా నిర్మాత ‘దిల్ రాజు’ కూడా గేమ్ చేంజర్ ఘన విజయం సాధిస్తుందని ప్రమోషన్స్ లో కూడా చెప్పాడు.పైగా ఆయన బ్యానర్ లో 50 వ చిత్రం కూడాను.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
బొబ్బిలి సత్యమూర్తి(శ్రీకాంత్) రూలింగ్ పార్టీ అభ్యుదయ పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తుంటాడు.గతంలో చేసిన ఒక పాపం తనని వెంటాడుతుందని భావించిన సత్యమూర్తి ఎలక్షన్స్ కి ఇంకా సంవత్సరం మాత్రమే ఉండటంతో ప్రజలకి మంచి చేయాలనుకుంటాడు.ఈ క్రమంలో రామ్ నంద(రామ్ చరణ్) యూపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి కలెక్టర్ గా వస్తాడు.సత్యమూర్తి కొడుకు మినిస్టర్ అయినటువంటి బొబ్బిలి మోపిదేవి(ఎస్ జె సూర్య) అరాచకాల్ని అడ్డుకుంటూ కలెక్టర్ పదవి అంటే ఎంత గొప్పదో,దాని ద్వారా సమాజానికి ఎంత మంచి చెయ్యచ్చో రుజువు చేస్తుంటాడు. వృద్యాప్యంలో ఉన్నఅప్పన్న(రామ్ చరణ్) భార్య అంజలి(పార్వతి) ని చూసీ సత్యమూర్తి భయపడతాడు.సత్యమూర్తి చనిపోవడంతో మోపిదేవి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు. మరి అతని కోరిక నెరవేరిందా? అప్పన్న ఎవరు?ఆయన కథ ఏంటి? పార్వతి ని చూసీ సత్యమూర్తి ఎందుకు భయపడ్డాడు? అసలు రామ్ నంద ఎవరు? అతని ఆశయం ఏంటనేదే ఈ కథ
ఎనాలసిస్
మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడా బోర్ కొట్టకుండానే సాగింది.కానీ సీన్స్ అన్ని కూడా గతంలో చాలా సినిమాలో వచ్చినవే.అదే విధంగా ఇలాంటి కథ తో చాలా సినిమాలే వచ్చాయి.మహేష్ హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ మూవీ కూడా ఇలాంటి లైన్ తోనే వచ్చింది.ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఎంట్రీ తో పాటు శ్రీకాంత్ ఎస్ జె సూర్య ల ఎంట్రీ సూపర్ గా ఉంటుంది.ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న శ్రీకాంత్ ఈ పాపం అయితే చేసానని బాధపడుహతున్నాడో,తన వల్ల నష్టపోయిన వాళ్ల కోసం వెతకడం అనేది చూపించాల్సింది.రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య వచ్చే కాలేజీ ఫ్లాష్ బ్యాక్ బాగుంది.మిగతా క్యారక్టర్ లు ని పెద్దగా చూపించకపోయినా కూడా ప్రతి సీన్ ని చరణ్ తన భుజ స్కందాలపై వేసుకొని నడిపించాడు.ఇంటెర్వేల్ ట్విస్ట్ అదిరిపోయినా కూడా దాని తాలూకు భావోద్వేగాలు మిస్ అయినట్ట్టుగా కనిపిస్తాయి.ఇందుకు కారణం క్యారక్టర్ ల మధ్య నడిచే భావోద్వేగాలు మిస్ అవ్వడమే.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే అప్పన్న క్యారక్టర్ తో పాటు ఆయన ఆశయం,చూపించారు.కాకపోతే అప్పన్న గురించి ఆంధ్రప్రదేశ్ లోని అందరకి తెలిసేలా కొన్ని సీన్స్ ఉండాల్సింది.ఇక అప్పన్న క్యారక్టర్ ముగిసాక రామ్ చరణ్,ఎస్ జె సూర్య ల మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా కొంచం బలహీనంగా ఉన్నాయి.అలాంటి సీన్స్ నిత్యం చాలా సినిమాల్లో వస్తూనే ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అభిమానులకి మంచి కిక్ ని ఇస్తుందని చెప్పవచు
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రామ్ చరణ్ తన రెండు క్యారెక్టర్ లోను కూడా సూపర్ గా చేసాడు.ఎంతలా అంటే తన టాగ్ లైన్ కి తగ్గట్టే నటనలో కూడా గ్లోబల్ హీరోలాగా మెప్పించడం జరిగింది.ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో పర్ఫెక్ట్ గా చూపించాడు. డాన్స్, ఫైట్స్ ల్లో కూడా తనకి ఎప్పటికి తిరుగులేదని మరో సారి నిరూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ క్యారక్టర్ లో అయితే తన నట విశ్వ రూపాన్ని చూపించాడు. ఆ క్యారెక్టర్ మొత్తం పంచె కట్టులో కనపడి ఓల్డ్ సినిమాల్లోని తన తండ్రి చిరంజీవిని మరిపించాడని చెప్పాలి.ఇక హీరోయిన్లుగా చేసిన కియారా అద్వానీ, అంజలి తమ తమ క్యారక్టర్ లో పర్ఫెక్ట్ గా సూటయ్యారు.ఆ ఇద్దరి వల్ల ఆయా క్యారెక్టర్స్ కి మరింత నిండుతనం కూడా వచ్చిందని చెప్పవచ్చు.
ఇక శంకర్ డైరెక్షన్ కూడా ఆయన గత చిత్రాలకి తగ్గ రేంజ్ లోనే ఉంది. శంకర్ అభిమానులు కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉంది. ఆయన పెట్టిన ఖర్చు మొత్తం స్క్రీన్ పై కనపడింది. ఆయన చాలా ఇంటర్వూస్ లో చెప్పినట్టుగా సాంగ్స్ కి పెట్టిన 75 కోట్లు ప్రేక్షకుల కంటి ముందు కనపడతాయి.కాకపోతే నానా హైరానా సాంగ్ మాత్రం మూవీలో రాలేదు. ఇక థమన్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, తిరు ఫొటోగ్రఫీ గేమ్ ఛేంజర్ కి అదనపు హంగుల్ని సమకూర్చాయని చెప్పవచ్చు.
ఫైనల్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ లాంటి కథ, సన్నివేశాలు గతంలో చాలానే సినిమాలు రావడం ఒక్కటే ఈ సినిమాకి మైనస్.కానీ రామ్ చరణ్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల సినిమాకి నిండు తనం వచ్చింది.
రేటింగ్ 2 .5 /5 అరుణా చలం