గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులలో మోడల్ ప్రైమరీ స్కూల్ గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఉండే కమిటీలో కన్వీనర్‌గా ఎంఈవో-1, కో కన్వీనర్‌గా ఎంఈవో-2 ఉంటారు. సభ్యులుగా ఐసీడీఎస్ సీడీపీవో, ఎంఆర్వోతో పాటు ఎంపీడీవోగానీ మున్సిపల్ కమిషనర్‌గానీ సభ్యులుగా ఉంటారు. క్లస్టర్ స్థాయి కమిటీల్లో కన్వీనర్‌గా క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా, సభ్యులుగా ఎంఈవో 1, 2, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు ఉంటారు. ఈ రెండు కమిటీలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల ఏర్పాటు గురించి చర్చిస్తారు.
Home Andhra Pradesh పాఠశాల విద్యలో సంస్కరణలు…! జీవో 117 రద్దు, మార్పులతో కొత్త ఉత్తర్వులు-cancellation of 117 go...