ఆదాయం తగ్గుతుంది..
ఎమ్మార్పీ పెరగడం వల్ల, బీర్ల వినియోగం తగ్గి, ఆమేరకు ఆదాయం తగ్గుతుందని బీఏఐ ప్రభుత్వానికి వివరించింది. బీర్ కేటగిరీ నుంచి వచ్చే పన్ను ఆదాయం ఈ ప్రతిపాదన వల్ల రూ.400 కోట్ల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. అంతేకాదు, రాష్ట్రంలోని 10 బ్రూవరీల్లో రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. అలాగే, భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారతాయని పేర్కొంది. ‘‘అధిక ధరలు అమ్మకాలను దెబ్బతీస్తాయి. తయారీ కార్యకలాపాలు తగ్గుతాయి. వాణిజ్యం, ఆతిథ్య పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని బీఏఐ హెచ్చరించింది.