భారతీయులే అధికం
హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేవారిలో భారతీయులు అధికంగా ఉంటారు. యూఎస్ ప్రారంభించనున్న కొత్త నిబంధనలు, సంస్కరణలు భారతీయ నిపుణులకు కొంత ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. 2023 లో జారీ చేసిన 3,86,000 హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా 72.3 శాతంగా ఉంది. హెచ్1 బీ వీసా సిస్టమ్ తో పాటు ఎల్ 1, స్టూడెంట్ వీసాల ప్రక్రియలో కూడా పలు సంస్కరణలను తీసుకువచ్చారు. యూఎస్ వీసా సిస్టమ్ లో చేపట్టిన సంస్కరణలకు సంబంధించి 2024 డిసెంబర్ 18న విడుదల చేసిన కొత్త నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పులను ప్రతిబింబించేలా సవరించిన ఫారం ఐ-129ను 2025 జనవరి 17న యూఎస్సీఐఎస్ (USCIS) ప్రచురించనుంది.