ఇక తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన… రైతు భరోసా పథకం గురించి మాట్లాడారు. జనవరి 26 నుంచి అన్నదాతల అకౌంట్లలో ఎకరానికి 12 వేల రూపాయల డబ్బులను జమ చేస్తామని చెప్పారు. సాగు చేసే ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. “ఐదు ఎకరాలో, పది ఎకరాలో కాదు ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి కూడా రైతు భరోసా అందుతుంది. జనవరి 26 నుంచి స్కీమ్ అమలు చేయబోతున్నాం. రూ. 8400 కోట్లు రైతుల అకౌంట్ల లోకి వెయ్యబోతున్నాం. ఇదే విషయాన్ని రైతులకు ధైర్యంగా చెప్పండి” అంటూ భట్టి ప్రకటన చేశారు.