క్షమాపణ చెప్పి తీరాల్సిందే – డిప్యూటీ సీఎం పవన్
“తిరుమల ఘటన ఎంతో కలిచివేసింది. జవాబుదారీతనంగా ఉంటానని ఎన్నికల సమయంలో చెప్పాను. అందులో భాగంగానే… తిరుమల ఘటనపై క్షమాపణలు చెప్పాను. వారిని పరామర్శించినప్పటికీ నాకు ఎంతో బాధ ఉంది. తప్పు ఎవరి వల్ల జరిగినా..బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పరామర్శించే సమయంలో భక్తులు వారి బాధలను చెప్పుకున్నారు. సరిగా చూసుకోలేదన్నారు. వారు చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయి. అలాంటి వారికి మనం క్షమాపణలు చెప్పాలి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవోవెంకయ్య చౌదరి,పాలకమండలి సభ్యులు వారి బాధ వింటే పరిస్థితి అర్థమవుతుంది. మీరంతా వెళ్లి క్షమాపణలు చెప్పండి. చెప్పి తీరాల్సిందే. వేరే దారి లేదు మీకు” అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.