ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
చేతులను మృదువుగా ఉంచుకోవడానికి కొన్ని చిన్న విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ముందుగా, చేతులను నీటితో తడపడాన్ని వీలైనంతగా తగ్గించండి. మీరు నీటితో ఏదైనా పని చేసినప్పుడు, మీ చేతులను వెంటనే టవల్‌తో తుడుచుకోండి. అలాగే, వ్యాయామం చేసిన తర్వాత వారానికి ఒకసారి మీ చేతులను బాగా స్క్రబ్ చేయండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే, మానిక్యూర్ కూడా చేయించుకోవచ్చు. ఎల్లప్పుడూ కలబంద జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా హ్యాండ్ క్రీమ్‌ను ఎంచుకోవడం బెటర్. మీ చేతులపై ఏదైనా దురద, అలర్జీ లేదా అధికంగా పొడిబారినట్లు కనిపిస్తే, వెంటనే మీరు వాడుతున్న ప్రొడక్టులను మార్చండి. పరిస్థితి తీవ్రంగా ఉంటే డెర్మటాలజిస్టును సంప్రదించండి.