పుష్యమాసం చాలా పునీతమైన మాసం. పుష్యమీ నక్షత్రం శనైశ్చరుని నక్షత్రం. ఈ మాసంలో విష్ణువు, శివుడు, శని, సూర్యుడు, పితృదేవతలు భక్తుల చేత పూజలందుకుంటారు. వ్రతం అంటే నియమము. “వరం తనో దీతి వ్రతం” అని శబ్ద వ్యుత్పత్తి. నియమనిష్ఠలతో దేవీదేవతలను పూజించి వారి అనుగ్రహం కోసం వ్రతాలు చేస్తుంటారు. వ్రతమేదైనా సంకల్పం ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి వ్రతాలు సహాయపడతాయి. వ్రతాచరణ సమయంలో క్షమ, దయ, దాన, శౌచ, ఇంద్రియ నిగ్రహం, దేవపూజ మొదలైనవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.