YS Abhishek Reddy : వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డా.వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థిన దేహానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. తన సోదరుడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. అనంతరం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి మరణించడం ఎంతో బాధాకరమని జగన్ అన్నారు. అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ అభిషేక్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌ రెడ్డి పార్థివదేహానికి పలువురు వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here