ఏ సీజన్‌లో దొరికే పండ్లు అప్పుడే తినకపోతే ఎంజాయ్ చేయలేం. మరి ఈ సంక్రాంతి టైంకి కేవలం పిండివంటలతోనే కాకుండా రేగు పండ్లను తినాలనుకుంటున్నారా.. మీ పిల్లలకు ఎలాగూ భోగి పండ్లు పోసేందుకు రేగు పండ్లు తీసుకొస్తారు కదా. వాటిల్లో కొన్నింటిని ఇలా పచ్చడి కోసం పక్కకుపెట్టండి. రుచికరమైన, నోరూరించే రోటి పచ్చడి చేసేసుకోవచ్చు. మీరు రేగు పండ్ల (రేక్కాయల) పచ్చడి చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి.