వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ… రేషన్ కార్డుల రూపురేఖలు మార్చిన సంగతి తెలిసిందే. కొత్తగా బియ్యం కార్డులను సైతం జారీ చేశారు. రేషన్ కార్డులపై వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉండేవి. అయితే రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో…రేషన్ కార్డుల డిజైన్లు మార్చాలని నిర్ణయించారు. లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డు నమూనాను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. అయితే దీంట్లో ఎలాంటి మార్పులు ఉంటాయోనేది త్వరలోనే తేలనుంది. ఇక కొత్త రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండటం తప్పనిసరి అని తెలిసింది.