అర్థం చేసుకోకుండా రాద్దాంతం
తన సొంత ఊరురైన నిజామాబాద్‍లో ఎక్కువగా సినీ ఈవెంట్ జరగవని దిల్‍రాజు అన్నారు. అందుకే అక్కడ సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ నిర్వహించాం అని చెప్పారు. “మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెలగల గురించి ఈవెంట్‍లో సంబోధించాను. నేను ఆ ఈవెంట్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, హేళన చేశానని కొందరు మిత్రులు కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ మిస్ అవుతున్నానని నేను ఈవెంట్ చివర్లో చెప్పా. దావత్ చేసుకోవాలని ఉందని చెప్పా. నేను మన కల్చర్‌ను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా కొందరు రాద్దాంతం చేస్తున్నారు” అని దిల్‍రాజు చెప్పారు.