అదనపు షోల అనుమతి రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ హైకోర్టు ఆదేశాలతో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాల అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. గేమ్ ఛేంజర్ సినిమాపై ఇచ్చిన ఉత్తర్వులు కేవలం టికెట్ ధరలకు సంబంధించినది మాత్రమేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సరైన భద్రత లేని థియేటర్లకు వచ్చే ప్రజలను నియంత్రించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు అదనపు షోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతిని రద్దుచేసింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా సినిమా ప్రదర్శించుకోవచ్చని పేర్కొంది. రోజుకు 5 షోలలో ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.