Sankranti rush in Hyderabad : సంక్రాంతి వేళ నగరవాసులు పల్లెలకు తరలివెళ్తున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే జనాలతో నగరమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. వాహనాల రద్దీతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి.