టీచర్స్ స్థానానికి మల్క కొమురయ్య
టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిత్వం ఖరారులో బీజేపీ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త మల్క కొమురయ్యను ఎంపిక చేయడం వెనుక బీసీ సామాజిక వర్గమే కారణమని చెబుతున్నారు. మల్క కొమరయ్య స్వస్థలం పెద్దపల్లి, విద్యారంగ అభివృద్ధి కోసం తనవంతు కృషిగా పాఠశాలలను స్థాపించారు. నాణ్యమైన విద్యను ప్రోత్సహించడంలో గణనీయమైన కృషి చేశారని పార్టీ భావిస్తోంది. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్ లో విద్యాసంస్థలను స్థాపించారు. ప్రస్తుతం పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ హైదరాబాద్ చైర్మన్ గా ఉన్నారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్, అధ్యాపకుడిగా గుర్తింపు ఉన్నది. తనకున్న అపారమైన అనుభవంతో తెలంగాణలో విద్యా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి టికెట్టు ఆశించగా ఈటెల రాజేందర్ కు కేటా మయించడంతో ఆయన విజయం కోసం తనవంతుగా కృషి చేశారు. పార్టీ పెద్దల వద్ద కూడా పరిచయాలు ఉండటం.. విద్యావేత్తగా ముద్రపడి ఉన్న నేపథ్యంలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కూడా. అధిష్టానవర్గం కొమురయ్య అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది.