Stormy Daniels: ‘హుష్ మనీ’ కేసులో డొనాల్డ్ ట్రంప్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ట్రంప్ కు బేషరతుగా డిశ్చార్జ్ శిక్ష విధిస్తామని ఇచ్చిన మాటను న్యాయమూర్తి జస్టిస్ జువాన్ మెర్చాన్ నిలబెట్టుకున్నారు. ట్రంప్ కు ఎలాంటి జైలు శిక్ష కానీ, జరిమానా కానీ విధించలేదు. దాంతో, అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఆటంకం కలగబోదు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం కారణంగా, ఆమెకు రహస్యంగా డబ్బు చెల్లించడం, ఆ మొత్తాన్ని దాచిపెట్టడానికి ట్రంప్ వ్యాపార రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.