చర్మారోగ్యానికి కూడా మేలు..
ఖర్జూరాలలో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల చర్మం ఎల్లప్పుడూ మృదువుగా, యవ్వనంగా ఉండడంలో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం చర్మంలో తేమను నిలుపుకునేందుకు సహాయపడుతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు చర్మ సంక్రమణలను నివారించడంలో సహాయపడతాయి ఖర్జూరాలలో విటమిన్ B5 (పాంటోతేనిక్ ఆమ్లం) రక్తప్రసరణను మెరుగుపరచి కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఫ్లవనాయిడ్స్, కారోటీనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హానికరమైన ఉత్పత్తుల నుండి కాపాడి, శరీరంలో నుండి విషాలను తొలగించడం ద్వారా చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొత్త కణాలను పునరుజ్జీవితం చేసే ప్రక్రియను పెంచుతుంది.