ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం చెందడంపై కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో బీసీసీఐ అధికారులు రివ్యూ మీటింగ్ చేశారు. జట్టు పరిస్థితి, చేయాల్సిన మార్పుల గురించి ముచ్చటించారు. టెస్టు కెప్టెన్‌గా ఇక కొన్ని నెలలే తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినట్టుగా రిపోర్టులు వచ్చాయి. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.