తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అయిన సంక్రాంతికి మొదటి రోజు భోగీనే. మూడు రోజుల పండుగలో మొదటి రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. పాత, చేదు సంగతులను మర్చిపోయి కొత్త ఆశలతో, సంతోషాలతో జీవితాలు వెలిగిపోవాలని కాంక్షిస్తారు. బంధుమిత్రులంతా ఒక చోట చేరి భోగి మంటలు వేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇలా చేరి పండుగ చేసుకునే సమయంలో మీ వారెవరైనా మిస్ అయినట్లు అనిపిస్తే, డోంట్ వర్రీ. మీ వాళ్ల కోసం, మీ కోసం స్పెషల్ మెసేజెస్ సిద్ధంగా ఉన్నాయి. ఇవి పంపి మీరు వాళ్ల సంతోషాలను కాంక్షిస్తున్నారని తెలియజేయండి.