సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు
తొక్కిసలాటపై విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన బాధ్యులను చంద్రబాబు ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. జరిగిన ఘోరమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? అవుతుందన్నారు. ఏదో తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు అధికారులు, టీటీడీ పాలక మండలిని కాపాడ్డానికే కదా? అని ప్రశ్నించారు. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా? అని ఆరోపించారు.