“రవి సంక్రమణే ప్రాప్తేన స్నాయాధ్యాస్తు మానవా సప్తజన్మసురోగస్వాత్ నిర్దనశ్చైవ జాయతే”
సూర్య సంక్రమణ సమయంలో స్నానం చేయనివాడు ఏడు జన్మల యందు రోగియై దరిద్రాన్ని అనుభవిస్తాడు. ఈ రోజున పాయసం, ధాన్యం, పండ్లు, విసనకర్రలు, వస్త్రాలు, త్రిమూర్తుల ప్రతిమలను పండితులకు దానం చేయాలి. మహిళలు పసుపు, కుంకుమ, సుగంధద్రవ్యాలు, పువ్వులు, బెల్లం పుణ్యస్త్రీలకు దానం చేయడం వల్ల మాంగళ్యాభివృద్ధి కలుగుతుంది. దేవాలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.