విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. గోదారి గట్టు పాటతో ఈ చిత్రానికి చాలా బజ్ వచ్చింది. అది కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు సూటయ్యేలా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి రోజు జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. కొన్ని రోజులుగా ప్రమోషన్లను హీరో వెంకటేశ్, అనిల్‍తో పాటు మూవీ టీమ్ సభ్యులు జోరుగా చేస్తున్నారు. వరుసగా ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి భారీగా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here