ఇందిరమ్మ ఇళ్ల వెబ్ సైట్ – ముఖ్యమైన అంశాలు:

  1. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. దరఖాస్తుదారుడికి ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసుకునే వీలు ఉంటుంది.
  2. ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ http://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
  3. హోం పేజీలో Grievance Entry ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఫిర్యాదు ప్రక్రియపై ముందుకెళ్లవచ్చు.
  4. ఫిర్యాదు లేదా సమస్య వివరాల తర్వాత.. Grievance Id జనరేట్ అవుతోంది.
  5. ఈ ఫిర్యాదుపై ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకున్న చ‌ర్య‌ల వివ‌రాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
  6. గ్రామాల్లో ఎంపీడీవో ద్వారా సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేరుతుంది.
  7. ఇక ప‌ట్ట‌ణాల్లో అయితే మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ద్వారా సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేరుతుంది.
  8. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కు సంబంధించి ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. 040-29390057 నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందవచ్చు.

ఇక గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here