రాగిపిండి దోస తయారీకి కావాల్సిన పదార్థాలు:

  1. రాగి పిండి – ఒక కప్పు
  2. బియ్యపు పిండి – అర కప్పు
  3. ఉప్మా రవ్వ – పావు కప్పు
  4. జీలకర్ర – రెండు టీ స్పూన్లు
  5. ఉప్పు – రుచికి తగినంత
  6. ఉల్లిపాయ – ఒకటి
  7. క్యారెట్ – రెండు క్యారెట్ ముక్కలు
  8. కొత్తిమీర – 50 గ్రాములు

తయారు చేసే విధానం:

  • ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బియ్యపు పిండి, రెండు స్పూన్ల రవ్వ, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి.
  • ఆ తర్వాత అందులో రెండు కప్పుల వాటర్ వేసి కలుపుతూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి.
  • ఇలా కలిపిన పిండిని పక్కకు పెట్టడం వల్ల పది నిమిషాల తర్వాత చిక్కగా మారుతుంది.
  • ఇందులో ఒక కప్పు వాటర్‌తో పాటు మీడియం సైజ్ ఆనియన్ ను చిన్న ముక్కలుగా కోసి, క్యారెట్ తురుము వేసి బాగా కలపండి.
  • ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొద్దిగా మిరియాల పొడి వేసి అంతా మిక్స్ చేయండి.
  • పిండిని జోరుగా చేసుకుని ఆ పిండిని వేడిగా ఉన్న పెనం మీద రవ్వదోస మాదిరిగా పోయండి.
  • ఈ దోస బాగా ఫ్రై అయిన తర్వాత పెనం మీద నుంచి ఈజీగా వచ్చేస్తుంది.
  • అంతేనండి, రాగి దోస రెడీ అయిపోయినట్లే. మీకు ఇష్టమైన చట్నీ వేసుకుని ఎంచక్కా తినేయొచ్చు.

రాగి పిండితో కలిగే ప్రయోజనాలు:

రాగి పిండిని ఏ రూపంలో తీసుకున్నప్పటికీ సరైన పోషకాలు అంది శరీరానికి శక్తి సమకూరుతుంది. ఎముకల దృఢంగా మారతాయి. హృదయారోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రాగి పిండితో చేసిన పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఇది డయాబెటిస్ సమస్య ఉన్న వారికి కూడా మంచిది. కేశారోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here