సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగీ. పెద్ద పండుగను మొదలుపెట్టేది భోగీతోనే. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భోగి పండుగను నిర్వహించుకుంటారు. భోగి రోజున ప్రజలు తమ ఇంట్లోని పాత వస్తువులను లేదా పనికిరాని వస్తువులను బయటకు తీస్తారు. భోగీ మంటల్లో వాటిని వేసి తగలబెడతారు. ఈ సంప్రదాయానికి అర్థం పాత వస్తువులను వదిలేసి కొత్తవాటిని స్వీకరించడం.