కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ.. ఎస్‌యూవీకి చెందిన ఐసీఈ వర్షెన్‌ని పోలి ఉంటుంది. అయితే ఇందులో ఈవీ స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. గ్రిల్ స్థానంలో క్లోజ్డ్ ప్యానెల్, రీడిజైన్డ్ ఎయిర్ డ్యామ్ ఇందులో ఉంటాయి. రివైజ్డ్ టెయిల్‌గేట్, కొత్త రేర్ బంపర్ కూడా ఇందులో ఉండొచ్చు. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ వెనుక భాగంలో రెండు వైపులా రోజ్ గోల్డ్ ఇన్సర్ట్లను పొందుతుంది. ఇది ఏరో ఇన్సర్ట్లతో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో రావచ్చు.