పూజ అనంతరం స్నానం చేయాలని పూజారి చెప్పడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. వెంటనే పూజారి బాత్‌రూమ్ లోపలకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె గట్టి కేకలు, అరుపులు వేస్తూ ఆ పూజారిని బయటకు నెట్టేసింది. షాక్‌కు గురై ఆ యువతి భయంతో తిరిగి రాజమండ్రి వెళ్లి పోయింది. రాజమండ్రిలోని మహిళ పోలీస్ స్టేషన్‌కు, జంగారెడ్డి గూడెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకుంది. ఫిర్యాదు ఇచ్చినా తీసుకోలేదని వాపోయింది. దీంతో కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేంద్ర మాట్లాడుతూ యువతి నుంచి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.