మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. జనవరి 10వ తేదీన ఈ పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ మూవీ రిలీజ్ అయింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా హెచ్‍డీ ప్రింట్ ఆన్‍లైన్‍లో లీక్ అవడం సంచలనంగా మారింది. థియేటర్లలో రిలీజైన ఒక్క రోజులోనే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ ప్రింట్ వచ్చేసింది. ఈ విషయంపై గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ స్పందించింది. దీని వెనుక ఓ ముఠా ఉందంటూ మరిన్ని విషయాలను వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here