16వేల అడుగుల ఎత్తులో 5జీ సేవలు..
జియో తన ఫుల్ స్టాక్ 5జీ టెక్నాలజీని ఉపయోగించి కరకోరం రేంజ్‌లోని ఫార్వర్డ్ పోస్ట్ వద్ద ప్లగ్ అండ్ ప్లే ప్రీ కాన్ఫిగర్ పరికరాలను విజయవంతంగా ఇన్స్టాల్ చేసింది! లాజిస్టిక్స్‌ని నిర్వహించే, గ్లేసియర్కి పరికరాలను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి వీలు కల్పించిన భారత సైన్యంతో కోఆర్డినేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. కఠినమైన వాతావరణం ఉన్నా, ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయినా, జియో తాజా సేవలతో 16,000 అడుగుల వద్ద భారత సైన్యానికి నమ్మదగిన కనెక్టివిటీ లభిస్తుంది.