సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.
‘డాకు మహారాజ్’ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.22.31 కోట్ల షేర్ ని రాబట్టగా, వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. నైజాంలో రూ.2.44 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.72 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.4.35 కోట్ల షేర్ తో.. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.51 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.30.82 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. అదే జరిగితే బాలకృష్ణ కెరీర్ లో రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా ‘డాకు మహారాజ్’ నిలవనుంది.