మేకప్ అంటే లిప్‌స్టిక్ లేకుండా పూర్తి కాదు. మేకప్ ఇష్టపడని వారు కూడా కేవలం పెదవులకు లిప్‌స్టిక్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ముఖం అందాన్ని, రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే చాలా మంది మహిళలు తమకు ఇష్టమైన బ్రాండ్, షేడ్స్‌లో లిప్‌స్టిక్‌లను తీసుకుంటు ఉంటారు. పెదవులకు రాసుకునేవి కాబట్టి ఖరీదైన వాటినే ఎంచుకుంటారు. దాన్ని ఎప్పటికీ పర్సులో పెట్టుకుని తమతో పాటే తీసుకెళతారు. వేరే వాళ్లతో లిప్‌స్టిక్‌ను పంచుకోవడానికి కూడా ఇష్టపడరు.