సంక్రాంతికి బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పకపోతే పండుగ పూర్తికాదు. పండుగ రోజు పూజలు, పిండివంటలు ఎంత ముఖ్యమో… ఆ రోజు బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పడం కూడా అంతే ముఖ్యం. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆరోజే ప్రపంచాన్ని నడిపించే సూర్యదేవుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతిగా మనం పండుగ చేసుకుంటాం. దీనిని దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉత్తరాయణం పేరుతో నిర్వహించుకుంటారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఒక్కో పేరుతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. ఈ రోజున ప్రజలు నువ్వులు, బెల్లంతో చేసిన ఆహారాలను, పెసరపప్పు, బియ్యంతో చేసిన కిచిడీలను దానం చేస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే ఇక్కడ మేము తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు, కోట్స్, మెసేజులు ఇచ్చాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here