గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ గా థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న బాలకృష్ణ కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవ్వగా బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.సంక్రాంతి హీరో బాలయ్యనే అనే అభిప్రాయాన్ని కూడా వాళ్లంతా వ్యక్తం చేస్తున్నారు.
అందుకు నిదర్శనంగా ఈ మూవీ రెండు రోజులకి 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.సినిమా మంచి విజయం సాధించిందనటానికి ఈ కలెక్షన్స్ నే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.మొదటి రోజు 56 కోట్ల గ్రాస్ ని రాబట్టిన విషయం తెలిసిందే.ఇక రాబోయే రోజుల్లో డాకు మహారాజ్ అనేక రికార్డులు నెలకొల్పుతుందని,సినిమాకి హిట్ టాక్ ఉన్న దృష్ట్యా మరికొన్ని రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారంటీ అని కూడా సినీ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇంజినీర్ గా,డాకు మహారాజ్ గా,నానాజీ గా మూడు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు.బాలకృష్ణ భార్యగా చేసిన ప్రగ్య జైస్వాల్, కలెక్టర్ గా శ్రద్ద శ్రీనాద్,విలన్ గా బాబీ డియోల్ తో పాటు డాకు మహారాజ్ లో చేసిన అందరు కూడా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.సితార ఎంటర్ టైన్మేంట్, ఫార్చ్యూన్ ఫోర్ లు కలిసి నిర్మించిన డాకు మహారాజ్ కి బాబీ దర్శకత్వం వహించగా థమన్ సంగీతాన్ని అందించాడు.