స్ప్రౌట్స్ అండ్ పనీర్ టిక్కీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలా ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గేవారికి ఇది ఉత్తమమైన అల్పాహారమని నిపుణులు కూడా చెబుతుంటారు. ఇక పనీర్ విషయానికొస్తే చాలా మంది ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన పాల పదార్థం. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది,. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను నివారించడంలో పనీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ మిక్స్ చేసి టేస్టీ టిక్కీ తయారు చేసుకుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.