కిక్కిరిసిపోయిన బస్టాండ్లు..
బారులు తీరిన బస్సులు, కిక్కిరిసిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లలో అడుగుతీసి అడుగుపెట్టలేని పరిస్థితి కనిపించింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి.