Koushik Reddy Arrest: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సమీక్షలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి యత్నించారంటూ కరీంనగర్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై 4 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.