ఈ సంక్రాంతికి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడ్డాయి. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’, జనవరి 12న ‘డాకు మహారాజ్’, జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు థియేటర్లలో పెట్టాయి. ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరనే ఆసక్తి కొద్దిరోజులుగా ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రావడంతో.. సంక్రాంతి విన్నర్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. (sankranthi 2025)

 

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ, శంకర్ శైలికి భిన్నంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా తెరకెక్కింది. చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందిన ఫస్ట్ ఫిల్మ్ స్థాయిలో లేదనే టాక్ ని మొదటి షో నుంచే సొంతం చేసుకుంది. పేలవమైన కథాకథనాలతో ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా సినిమా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. రోజురోజుకి కలెక్షన్లు పడిపోతున్నాయి. పెట్టిన బడ్జెట్ కి, వస్తున్న కలెక్షన్స్ ని పోల్చి చూస్తే.. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ రేస్ లో ‘గేమ్ ఛేంజర్’ పూర్తిగా వెనకపడిపోయిందని చెప్పాలి. (Game Changer)

 

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎమోషనల్ టచ్ తో స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ‘డాకు మహారాజ్’ తెరకెక్కింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ దానిని మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా విజువల్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులకు ఇది థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తోంది. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబడుతూ ‘డాకు మహారాజ్’ చిత్రం దూసుకుపోతోంది. (Daaku Maharaaj)

 

‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’ సినిమాల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం, పరవాలేదు అనే టాక్ ని సొంతం చేసుకుంది. కథాకథనాలు రొటీన్ గా ఉన్నప్పటికీ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే, కాసేపు నవ్వుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా, ఆ పరంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. (Sankranthiki Vasthunam)

 

మొత్తానికి ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల టాక్ ని బట్టి చూస్తే.. బాలయ్య సంక్రాంతి విన్నర్ కాగా, వెంకీ మామ సంక్రాంతి రన్నర్ అని చెప్పవచ్చు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here